బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 25, 2020 , 01:40:30

బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధంచేయండి

బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధంచేయండి
  • ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఆదేశాలు


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దళితుల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం 2020-21 ఏడాదికి బడ్జెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు. శుక్రవారం బీఆర్కేభవన్‌లోని కార్యాలయంలో బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రి సమీక్షించారు. ఎస్సీ కార్పొరేషన్‌లోని పథకాలు, గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సా ధించేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. 


మంత్రి కొప్పులను కలిసిన ఫోర్స్‌ సంస్థ ప్రతినిధులు

అనాథల హక్కుల సాధన లక్ష్యంగా అంతర్జాతీయ సద స్సు నిర్వహణ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఫోర్స్‌ సంస్థ ప్రతినిధులు కలిశారు. ఫిబ్రవరి 8, 9 తేదీ ల్లో హైదరాబాద్‌లో నిర్వహించే సదస్సుకు హాజరుకావాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో ఫోర్స్‌ వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్య, కమతం రజిత, పూజ, దీపిక ఉన్నారు. 


logo