శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 12:33:53

'పన్నులు చెల్లించి... పల్లెల ప్రగతికి పాటుపడండి'

'పన్నులు చెల్లించి... పల్లెల ప్రగతికి పాటుపడండి'

వ‌రంగ‌ల్ : ఇంటి, న‌ల్లా పన్నులు చెల్లించి.. ప‌ల్లెల ప్ర‌గ‌తికి తోడ్పాటు అందించాల‌ని రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. పర్వతగిరిలోని తన నివాసానికి ఇంటి, న‌ల్లా ప‌న్నును గ్రామ పంచాయ‌తీకి మంత్రి ద‌యాక‌ర్‌రావు చెల్లించారు. తన ఇంటి,నల్లా పన్నులు కట్టి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు మంత్రి. 

ఇంటి, నల్లా పన్నులు క‌లిపి మొత్తం రూ.5,220ను గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్‌కు చెల్లించి ర‌శీదు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌జ‌లంద‌రూ ప‌న్నులు చెల్లించి బాధ్య‌తాయుతంగా మెల‌గాల‌న్నారు. పన్నులు చెల్లించి, పల్లెల ప్రగతికి పాటుపడండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. 


logo