మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 21:49:40

అభివృద్ధిని చూసి ఓటేయాలి : మంత్రి ఎర్రబెల్లి

అభివృద్ధిని చూసి ఓటేయాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ :  అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆయన మీర్ పేట్ హౌసింగ్ కాలనీ డివిజన్‌లోని లక్ష్మీనగర్, చైతన్య నగర్, ఇందిరా నగర్ తదితర కాలనీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభుదాస్‌తోపాటు కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

అనంతరం లక్ష్మీనగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలి ఓటు వేయాలని కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని కోరారు. పక్కాలోకల్‌ పార్టీ టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి సాధ్యమని, మీర్‌పేట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఈ డివిజన్‌ను అద్భుతంగా తీర్చుదిద్దుతానని అన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత మాయ మాటలు నమ్మి అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని కోరారు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్‌ అభ్యర్థి ప్రభుదాస్‌ను భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.