బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 09, 2020 , 10:31:56

మేరు సంఘాన్ని అభినందించిన మంత్రి దయాకర్‌రావు

మేరు సంఘాన్ని అభినందించిన మంత్రి దయాకర్‌రావు

వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా మేరు సంఘం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న అన్ని సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, వ్యక్తులకు అభినందనలు. స్వచ్ఛంద సేవకు ఇది సరైన సమయం.

 ప్రత్యేకించి నిరుపేదలకు ఆదుకోవడానికి ముందుకు రావాలి. కరోనా వైరస్‌ కారణంగా మొత్తం ప్రపంచమే స్తంభించింది. ఆర్థిక లావాదేవీలు మాత్రమే కాదు, ప్రజా జీవనం కూడా నిలిచింది. ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. తాము సంపాదించిన దాంట్లో పది మందికైనా ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి. అనేక సంస్థలు, సంఘాలు, వ్యక్తులు సీఎం సహాయ నిధికి ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిపారు. logo