శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 10:44:44

గట్టమ్మ ఆలయంలో మంత్రి, ఎంపీ పూజలు

గట్టమ్మ ఆలయంలో మంత్రి, ఎంపీ పూజలు

ములుగు : రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగళవారం జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మొదట ఎంపీ మాలోతు కవితతో కలిసి గట్టమ్మ దేవాలయంలో పూజలు చేశారు. మంత్రి వాజేడు, వెంకటాపురం మండలాల్లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు ప్రారంభించి, మహిళా శక్తి భవన్‌కు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వాజేడు మండలంలో రెవెన్యూ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా అక్కడున్న వసతులను పరిశీలించి, అందుతున్న సేవలను తెలుసుకోనున్నారు. అనంతరం మేడారంలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు.