శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 10:45:18

బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటిన మంత్రి అల్లోల

బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటిన మంత్రి అల్లోల

హైదరాబాద్ : ఆరో విడుత హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతున్నది. పల్లె, పట్టణం అంతటా పెద్ద ఎత్తున ప్రజలు మొక్కలు నాటుతున్నారు. హైదరాబాద్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్ లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు.  కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, ఎఫ్డీసీ ఎండీ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు లుంబిని ఎస్ ఎల్ ఎన్స్ప్రింగ్స్ గేటెడ్ కమ్యూనిటీ లో ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.


logo