శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 14:25:30

గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి మంత్రి అల్లోల శుభాకాంక్ష‌లు

గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి మంత్రి అల్లోల శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, ఎంపీ కేశ‌వ‌రావును న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో గ‌ల ఆయ‌న నివాసంలో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ణ్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ డివిజ‌న్ కార్పోరేటర్‌గా గెలిచిన కేకే కూతురు గ‌ద్వాల‌ విజ‌య‌ల‌క్ష్మికి మంత్రి పుష్ప‌గుచ్చం అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బంజారాహిల్స్ డివిజ‌న్ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, మాజీ డీసీసీబీ చైర్మ‌న్ రాంకిష‌న్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అల్లోల సురేంద‌ర్ రెడ్డి తోపాటు ల‌క్ష్మ‌ణ‌చాంద మండ‌ల నాయ‌కులు ఉన్నారు.


logo