శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 17:32:21

ప్రతి ఆదివారం పరిశుభ్రతలో పాల్గొన్న మంత్రి అల్లోల

ప్రతి ఆదివారం పరిశుభ్రతలో పాల్గొన్న మంత్రి అల్లోల

నిర్మల్‌:  రాష్ట్రపురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదివారం నిర్మల్‌లోని తన నివాసంలో నిర్వహించారు.సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరి చేరవని అన్నారు.

ఇంటితో పాటు పరిసరాల్లోనూ శుభ్రం చేసుకోవాలని హరితహారంలో మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఇంటిలోని గార్డెన్‌లో చెత్తను తొలగించి కొత్తమొక్కలను నాటారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo