సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 14:56:48

ఎల్వోసీ పత్రాన్ని అందజేసిన మంత్రి అల్లోల‌

ఎల్వోసీ పత్రాన్ని అందజేసిన మంత్రి అల్లోల‌

నిర్మల్ : జిల్లాలోని మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన పైడి మర్రి సాగర్ అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాదులోని నిమ్స్ దవాఖానలో  చికిత్స పొందుతున్నారు. గ‌త కొంత కాలంగా కడుపులో ట్యూమర్స్ తో భాద‌పడుతున్న సాగర్ ఆరోగ్య పరిస్థితి గురించి స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తెచ్చారు. సాగర్‌కు  మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను మంత్రి  సీఎం సహాయనిధి నుంచి రూ. 2.00 లక్షలు మంజూరు చేయించారు. మంగ‌ళ‌వారం నిర్మల్ మంత్రి క్యాంపు కార్యాలయంలో సాగర్ భార్య మమతకు మంత్రి ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్‌ జనరల్ సెక్రటరీ వికాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.