సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 13:34:11

రైతు వేదిక, చెక్ డ్యాం నిర్మాణ పనులకు మంత్రి అల్లోల శంకుస్థాపన

రైతు వేదిక, చెక్ డ్యాం నిర్మాణ పనులకు మంత్రి అల్లోల శంకుస్థాపన

నిర్మల్ : రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు మంత్రి  శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయనికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రైతులందరినీ సంఘటితం చేసేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, రైతన్నల సమిష్టి నిర్ణయాలకు ఇవి వేదికలుగా పని చేస్తాయని తెలిపారు. 

హరిత హారంలో భాగంగా మంత్రి  మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ హరిత హారంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు.  అనంతరం సారంగపూర్ మండలం వైకుంఠపూర్ గ్రామంలో స్వర్ణవాగు పైన రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యాం పనులకు మంత్రి  భూమి పూజ చేశారు.

logo