శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 30, 2020 , 16:09:57

బస్సు ప్రమాద స్థలిని ప‌రిశీలించిన మంత్రి అల్లోల‌

బస్సు ప్రమాద స్థలిని ప‌రిశీలించిన మంత్రి అల్లోల‌

నిర్మల్ : మెద‌క్ జిల్లా చేగుంట వ‌ద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ  కొట్టిన ఘటనలో డ్రైవర్ విశ్వనాథం (41) మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, నిర్మల్ పట్టణానికి చెందిన డ్రైవర్ విశ్వనాథం మృతి విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ మంత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గ‌ల కార‌ణాలను మంత్రి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయ‌ప‌డ్డ  ప్రయాణికుల ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు.  డ్రైవ‌ర్ విశ్వనాథం కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తెలిపారు. logo