సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 26, 2021 , 11:59:46

పద్మశ్రీ క‌న‌క‌రాజుకు మంత్రి అల్లోల శుభాకాంక్షలు

పద్మశ్రీ క‌న‌క‌రాజుకు మంత్రి  అల్లోల శుభాకాంక్షలు

హైదరాబాద్ : పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గుస్సాడీ నృత్య క‌ళాకారుడు క‌న‌క‌రాజుకు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.  ఉదయం క‌న‌కరాజుకు ఫోన్ చేసి అభినందించారు.  ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల‌ను ప్రతిబింబించే గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి ప‌రిచ‌యం చేసిన క‌న‌క‌రాజుకు అరుదైన గౌర‌వ‌ం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ‌కు, ఆదివాసీలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. గుస్సాడీ క‌ళారూపంతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా కనకరాజు గొప్ప పేరు తెచ్చార‌ని ప్రశంసించారు. గుస్సాడీ కళ అంత‌రించి పోకుండా తర్వాతి తరానికి శిక్షణ ఇచ్చి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo