మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 13:45:40

శానిటేష‌న్ సిబ్బందికి ఉచితంగా పీపీఈ కిట్స్

శానిటేష‌న్ సిబ్బందికి ఉచితంగా పీపీఈ కిట్స్

ఖ‌మ్మం : ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో సేవ‌లందిస్తున్న శానిటేష‌న్ సిబ్బంది ప‌ట్ల ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ మాన‌వ‌తా హృద‌యం చాటుకున్నారు. కార్పొరేష‌న్ ప‌రిధిలో ప‌ని చేస్తున్న శానిటేష‌న్ సిబ్బంది అంద‌రికి మంత్రి ఉచితంగా పీపీఈ కిట్లు, షూ, టోపీలు అందించారు. ఉత్త‌మ శానిటేష‌న్ వ‌ర్క‌ర్స్ కు ప్ర‌శంసా ప‌త్రాల‌ను మంత్రి అంద‌జేసి అభినందించారు. 

ఈ సందర్భంగా మంత్రి అజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి అని పేర్కొన్నారు. ప్ర‌జారోగ్యం కోసం కార్మికులు నిరంత‌రం శ్ర‌మిస్తున్నార‌ని తెలిపారు. శానిటేష‌న్ సిబ్బందికి ఆరోగ్య ప‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించేందుకు, వేత‌నాలు పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి చెప్పారు. ఖమ్మం న‌గ‌రాన్ని ఈ కార్మికులు ఎప్ప‌టికప్పుడు శుభ్రంగా ఉంచ‌డం అభినంద‌నీయ‌మ‌ని మంత్రి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మేయర్ డాక్టర్ పాపాలాల్, కమిషనర్ అనురాగ్ జయంతి, జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజు, డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్ లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. 


logo