సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 12:57:32

ఊరూరా పండుగలా.. మంత్రి కేటీఆర్ జన్మదినం

ఊరూరా పండుగలా.. మంత్రి కేటీఆర్ జన్మదినం

హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, నవతరం నాయకుడు, యువతకు మార్గదర్శి మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా జరుపుకున్నారు. కేకులు కట్ చేసి, మొక్కలు నాటి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యకృషీవలుడు, పేదల పెన్నిది కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పలు దేవాలయాల్లో పూజలు చేశారు. మంత్రి బర్త్ డే సందర్భంగా ఆయ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 


ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా మావల హరితవనం లో ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేష్ మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీలో 20వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు. ప్రారంభించారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవ లక్ష్మి టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మాహబూబాబాద్ జిల్లాలో పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటిన టీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మొక్కలు నాటారు. ఎమ్మెల్యే పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నపురం  మండలంలోని కర్కపల్లిలో  ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మొక్కలు నాటారు.  గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు.