శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 06:37:15

రాష్ట్రంలో త‌గ్గ‌తున్న ఉష్ణోగ్ర‌తలు.. వ‌ణికిస్తున్న చలి

రాష్ట్రంలో త‌గ్గ‌తున్న ఉష్ణోగ్ర‌తలు.. వ‌ణికిస్తున్న చలి

హైద‌రా‌బాద్: రాష్ట్రంలో రాత్రిళ్లు చలి తీవ్రత పెరు‌గు‌తు‌న్నది. కనిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు క్రమంగా తగ్గు‌తు‌న్నాయి. శుక్ర‌వారం నల్ల‌గొం‌డలో కనిష్ఠ ఉష్ణో‌గ్రత సాధా‌రణం కంటే మూడు డిగ్రీల మేర తగ్గి 19.4 డిగ్రీ‌లుగా నమో‌దైంది. తమి‌ళ‌నాడు తీరం, దానిని ఆను‌కుని ఉన్న నైరుతి బంగా‌ళా‌ఖా‌తంలో 4.5 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్న‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం  వెల్ల‌డించింది. తూర్పు మధ్య బంగా‌ళా‌ఖాతం, దానిని ఆను‌కుని ఉన్న ఉత్తర అండ‌మాన్‌ సముద్ర ప్రాంతంలో ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ఏర్ప‌డి‌నట్టు తెలిపింది. వీటి ప్రభా‌వంతో రాష్ట్ర‌వ్యా‌ప్తంగా శని‌వారం నుంచి మూడ్రో‌జు‌ల‌పాటు పొడి వాతా‌వ‌ర‌ణమే ఉండ‌నుంది.