బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 15:24:07

కరోనాపై మిమిక్రీ ఆర్టిస్టు రమేష్‌ సరదా వీడియోలు

కరోనాపై మిమిక్రీ ఆర్టిస్టు రమేష్‌ సరదా వీడియోలు

కరోనా మహమ్మారిపై ప్రభుత్వంతో పాటు పోలీసులు, వైద్యులు,  కళాకారులు, పత్రికలు, టీవీలు ప్రజలకు ఎంతో అవగాహన కలిగిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు జనాన్ని అవేర్‌ చేస్తూనే ఉన్నారు. కవితలు, వ్యాసాలు, వీడియోలు, డాన్సులు, పాటలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. మిమిక్రి ఆర్టిస్టు రమేష్‌ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. సరదా రచనలకు మిమిక్రి చేసి సినిమా క్లిప్పింగులతో కలపి వీడియోల రూపంలో అందరికీ షేర్‌ చేస్తున్నారు. కరోనా అవగాహన కోసం రమేష్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


logo