మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 13:01:07

డ‌బీర్‌పురాలో ఎంఐఎం విజ‌యం

డ‌బీర్‌పురాలో ఎంఐఎం విజ‌యం

హైరాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన మొద‌టి రౌండ్ ఫ‌లితాల్లో టీఆర్ఎస్‌, ఎంఐఎం చెరో రెండు సీట్ల‌లో విజ‌యం సాధించాయి. మెహ‌దీప‌ట్నంలో ఎంఐఎం అభ్య‌ర్థి, మాజీ మేయ‌ర్ మాజిద్ హుస్సేన్, డ‌బీర్‌పురాలో అలందార్ హుస్సేన్‌ఖాన్ విజ‌యంసాధించారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో రాజ్‌కుమార్ ప‌టేల్‌, మెట్టుగూడ‌లో సునీత ఘ‌న విజ‌యం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ 60 డివిజ‌న్ల‌లో ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. మ‌రో 30 డివిజ‌న్ల‌లో ఎంఐఎం దూసుకుపోతున్న‌ది. 5 డివిజ‌న్ల‌లో బీజేపీ, 3 డివిజ‌న్ల‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నాయి.