వరంగల్ అర్భన్ : మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ తల్లిదండ్రులకు సూచించారు. వాహనాలు నడుపుతూ మైనర్లు ఎవరైనా పట్టుబడితే వారి తల్లిదండ్రులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే నష్టాలపై రూపొందించిన సోషల్ మీడియా ప్రమోషనల్ వీడియోను సీపీ విడుదల చేశారు. అనంతరం ట్రాఫిక్ మేనేజ్మెంట్పై గురువారం మాట్లాడుతూ.. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి వాహనాలు ఇస్తే జైలు తప్పదన్నారు. మైనర్లకు బైక్స్, స్కూటర్స్, కార్లు ఇవ్వడాన్ని నిరుత్సాహపరిచేలా 40 సెకన్ల నిడివి గల వీడియోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ(ట్రాఫిక్) బాలాస్వామి, సీటీసీ ఏసీపీ సాంబయ్య, హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.