గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:02:33

మరో మూడు రోజులు వర్షాలు

మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో/ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పలుచోట్ల శుక్రవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖాజీపేటలో అత్యధికంగా 4.25 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాగల మూడ్రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ, మధ్యప్రదేశ్‌ నుంచి తమిళనాడు వరకు రెండు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాటి ప్రభావంతో శని, ఆదివారాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడి, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. logo
>>>>>>