బుధవారం 27 మే 2020
Telangana - Apr 30, 2020 , 22:33:39

250 కి.మీ. నడిచాం... ఇంకా వందల కిలోమీటర్లు నడవాలి

250 కి.మీ. నడిచాం... ఇంకా వందల కిలోమీటర్లు నడవాలి

మంచిర్యాల : వలస కూలీల బాధ వర్ణనాతీతం. వందలాది మంది కూలీలు సొంత ఊళ్లకు గురువారం మంచిర్యాల మీదుగా నడుచుకుంటూ వెళ్లారు. పిల్లాపాపలలతో ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖమ్మంలో కూలీ పని చేసే 150 మంది కూలీలు ఉత్తరప్రదేశ్‌ తరలివెళ్తున్నారు. ఇప్పటికే వీరు 250 కిలోమీటర్లు నడిచారు. మరో 1350 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. హైదరాబాద్‌ నుంచి దాదాపు 300 మంది కూలీలు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌కు వెళ్తున్నారు. వీరు ఇప్పటికే 250 కిలోమీటర్ల నడిచారు. మరో 700 కిలోమీటర్లు నడవాల్సి ఉన్నట్లు కూలీలు వెల్లడించారు. 
logo