శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 01, 2020 , 16:37:16

వలసకూలీలకు రేషన్‌ బియ్యం, నగదు పంపిణీ

వలసకూలీలకు రేషన్‌ బియ్యం, నగదు పంపిణీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వలసకూలీలను తెలంగాణ బిడ్డలవలె కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న సీఎం పిలుపుమేరకు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వారి యోగక్షేమాలను పట్టించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారి జీవనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టా డివిజన్‌ పరిధిలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ వలస కూలీలకు నేడు రేషన్‌ బియ్యం, నగదును పంపిణీ చేశారు. ప్రతీ వ్యక్తికి 12 కేజీల రేషన్‌ బియ్యంతో పాటు రూ. 500ను అందజేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని చింతగుర్తి గ్రామంలో వలసకూలీలకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ రేషన్‌ బియ్యం, నగదును పంపిణీ చేశారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వలస కూలీలంతా సామాజిక దూరం పాటిస్తూ రేషన్‌ బియ్యాన్ని తీసుకున్నారు.

logo