శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 00:43:42

సొంతూరికి వలస కూలీలు

సొంతూరికి వలస కూలీలు

-ఆంధ్రా సరిహద్దు నుంచి స్వగ్రామానికి 26 మంది  

-మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో కథ సుఖాంతం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఆంధ్రా సరిహద్దులో చిక్కుకున్న వలస కూలీలు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సొంతగూటికి చేరుకున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పాచ్యతండాకు చెందిన 26 మంది వ్యవసాయ పనుల నిమిత్తం పొరుగున ఉన్న ఏపీలోని పులిచింతల ఆయకట్టుకు వెళ్లారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఉపాధి కోల్పోయారు. దీంతో సొంతూరుకు వస్తుండగా రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 13 గంటలపాటు అక్కడే ఉన్న వారు మంత్రి జగదీశ్‌రెడ్డికి ఫోన్‌లో విషయం చెప్పారు. స్పందించిన మంత్రి.. వారిని సొంతూరుకు చేర్చాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డిని ఫోన్‌లో ఆదేశించారు. దీంతో అందరికీ పరీక్షలు చేసి వారిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. తమను సురక్షితంగా తండాకు తరలించిన మంత్రి జగదీశ్‌రెడ్డికి కూలీలు, చివ్వెంల జెడ్పీటీసీ సంజీవ్‌నాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. 


logo