శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 10:42:19

వడదెబ్బతో వలస కార్మికుని మృతి

వడదెబ్బతో వలస కార్మికుని మృతి

భద్రాచలం: లాక్‌డౌన్‌తో పనులు లేకపోవడంతో స్వస్థలానికి బయల్దేరిన మరో వలస కార్మికుడు మృతిచెందాడు. ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన వలస కార్మికుల బృందం హైదరాబాద్‌ నుంచి మే 10న (ఆదివారం) బయల్దేరారు. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు సోమవారం భద్రాచలం చేరుకున్నారు. అందులోని ఓ యువకుడు వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతని సహచరులు భద్రాచలంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడని వైద్యులు ప్రకటించారు.


logo