బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 16:51:24

సాగర్‌ నుంచి ఏపీకి వలస కూలీల తరలింపు

సాగర్‌ నుంచి ఏపీకి వలస కూలీల తరలింపు

నల్లగొండ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో చిక్కుకుపోయిన వలస కూలీలను అధికారులు నేడు ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. నాలుగు బస్సుల్లో మొత్తం 120 మందిని అధికారులు ఏపీకి పంపించారు. లాక్‌డౌన్‌ కాలంలో వలస కూలీలు స్థానికంగా బీసీ పాఠశాలలో ఆశ్రయం పొందారు. వీరందరికి వైద్య పరీక్షలు చేసి అనంతరం ఏపీకి తరలించారు.


logo