సోమవారం 01 జూన్ 2020
Telangana - May 12, 2020 , 17:56:57

వలస కూలీలు హోం క్వారెంటైన్ లో ఉండాలి

వలస కూలీలు హోం క్వారెంటైన్ లో ఉండాలి

వరంగల్ అర్బన్ : ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు  వెళ్లిన వలస కూలీలు తమ సొంతూళ్ల కు చేరుతున్నారు. ఇలా చేరిన వారికి హోమ్ క్వారెంటైన్ ముద్రలు వేస్తూ 14 రోజుల పాటు ఇండ్లలోనే ఉండాలని ప్రత్యేక వైద్య బృందాలు సూచిస్తున్నాయి. జిల్లాలో లాక్‌డౌన్ సడలింపులో భాగంగా ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 383 మంది జిల్లాకి చేరుకున్నారని, వీళ్లను హోమ్ క్వారెంటైన్ లో ఉండాలని సూచించనట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


logo