మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 20:19:51

ఎమ్మెల్సీ కవితను కలిసిన మధ్యాహ్న భోజన కార్మికులు

ఎమ్మెల్సీ కవితను కలిసిన మధ్యాహ్న భోజన కార్మికులు

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మధ్యాహ్న భోజన కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను  విన్నవించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. స్పందించిన కవిత మాట్లాడుతూ..  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చడంలో మధ్యాహ్న భోజన కార్మికుల పాత్ర కీలకమని అన్నారు.

ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యూనియన్ ప్రతినిధులు ప్రతిపాదించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.  ఎమ్మెల్సీని కలిసిన వారిలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమండ్లు, ప్రధాన కార్యదర్శి డీ బాబాయి తదితరులున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo