ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 02:05:46

మధ్యాహ్న భోజనం ధరలు పెంపు

మధ్యాహ్న భోజనం ధరలు పెంపు

  • ప్రాథమిక స్కూళ్లకు 0.49.. ఆపైన 74 పైసలు
  • గుడ్డుకు 2 రూపాయలు అదనం.. విద్యాశాఖ జీవో

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం పథకానికి వంట ఖర్చుల కింద అయ్యే మొత్తాన్ని  రాష్ట్రప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్‌ జీవో జారీచేశారు. పెరిగిన ధరలు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి వర్తిస్తాయని తెలిపారు. ప్రాథమిక స్కూల్లో 49 పైసలు, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు 74 పైసలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అమలుచేస్తున్న తొమ్మిది, పదో తరగతులకు కూడా 74 పైసలు పెంచారు. కోడిగుడ్డుకు రూ.2 అదనంగా చెల్లించనున్నారు. 
logo