మంగళవారం 02 జూన్ 2020
Telangana - Jan 28, 2020 , 17:33:16

మధ్యాహ్న భోజన పథకం వంట ధరల పెంపు

మధ్యాహ్న భోజన పథకం వంట ధరల పెంపు

హైదరాబాద్‌: మధ్యాహ్న భోజన పథకం వంట ధరలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి వంట ధర రూ.4:35 నుంచి 4:48లకు పెంచారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి వంట ధర రూ.6:71కు పెంచారు. 9,10 తరగతులకు గుడ్డు ధర రూ.2 కలిపి వంట ధర రూ.8:71కు పెంచారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధరలు పెంచినట్లు అధికారులు తెలిపారు. 2019 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. 


logo