బుధవారం 08 జూలై 2020
Telangana - Apr 17, 2020 , 08:47:19

ఫోన్‌చేస్తే ఇంటికే మందులు

ఫోన్‌చేస్తే ఇంటికే మందులు

  • మెట్రోమెడి ఫ్రీహోం డెలివరీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో మందుల కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా మెట్రో మెడీ ఈ ఫార్మసీ అండ్‌ హెల్త్‌ స్టోర్‌ ‘ఎక్స్‌ప్రెస్‌ హోం డెలివరీ’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. పిల్లలు, వృద్ధులకు కావాల్సిన మందులను ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నది. 93914 22222 నంబర్‌కు కాల్‌చేసి మందుల పేర్లు చెప్పినా లేదా వాట్సాప్‌ ద్వారా మందుల చీటీ పంపినా తక్కువ సమయంలోనే ఇంటికి చేరుస్తున్నారు. దీనికోసం ఎలాంటి రుసుం తీసుకోవటం లేదని, మందుల బిల్లుల ఆధారంగా డబ్బు చెల్లిస్తే సరిపోతుందని మెట్రోమెడి ఎండీ బైరా దిలీప్‌ చక్రవర్తి తెలిపారు. నిత్యం 400 నుంచి 500 మందికి మందులను సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. 


logo