శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 15:55:08

పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తాం : మంత్రి కేటీఆర్‌

పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తాం : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో సభ్యులడిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ... పాతబస్తీలో మెట్రో లైన్‌ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూర్తి చేస్తామన్నారు. మెట్రోలో కేంద్రం వాటా 10 శాతమేనన్నారు. అందులో ఇంకా రూ. 250 కోట్లు రావాల్సి ఉందన్నారు.  ప్రభుత్వం ప్రజా రవాణాలో చాలా సీరియస్‌గా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో హైదరాబాద్‌ అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అందులో ప్రజా రవాణాకు చాలా పెద్ద పాత్ర ఉండబోతున్నట్లు తెలిపారు.


logo