శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 03, 2020 , 06:29:35

గాంధీ దవాఖాన, భరత్‌నగర్‌లో ఆగనున్న మెట్రో రైళ్లు

గాంధీ దవాఖాన, భరత్‌నగర్‌లో ఆగనున్న మెట్రో రైళ్లు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇక ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మెట్రోరైల్‌లో ప్రయాణించవచ్చు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మెట్రోరైల్‌ ప్రయాణ సమయాన్ని పొడిగించారు. కాగా, ఇన్నిరోజులుగా కరోనా దృష్ట్యా మూసివేసిన భరత్‌నగర్‌, గాంధీ దవాఖాన, ముషీరాబాద్‌ మెట్రో స్టేషన్లను ఇవాళ తెరిచారు. 

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి చివరివారంలో హైద్రాబాద్‌ మెట్రో సేవలు నిలిచిపోయాయి. సుమారు 168 రోజుల తర్వాత సెప్టెంబర్‌ 7న మెట్రో రైల్‌ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. విడుతల వారీగా మూడు కారిడార్లలో రైళ్లను ప్రారంభించారు. ప్రారంభంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడిచాయి. అనంతరం రైళ్ల ప్రయాణ సమయాలను కూడా క్రమంగా పెంచుతూ వచ్చింది. అదేవిధంగా కరోనా కారణంగా మూసివేసిన మెట్రో స్టేషన్లను కూడా తాజాగా తెరిచింది. దీంతో హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో మెట్రోసేవలు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.