సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 13:00:39

హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు బంద్‌

హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు బంద్‌

హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు  ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సేవలను ఆదివారం నిలిపివేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. రేపు జనతా కర్ఫ్యూలో భాగంగా మెట్రోరైల్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం రైలు సర్వీసులు నిలిచిపోనున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలెక్కవని రైల్వే ప్రకటించింది.


logo