శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 01:48:55

మూడ్రోజుల్లో మెట్రో పరుగు

మూడ్రోజుల్లో మెట్రో పరుగు

  • రాత్రి 9గంటల వరకే సర్వీసులు
  • 9వ తేదీ నుంచి మొత్తం 3 కారిడార్లలో
  • ఏర్పాట్లు పూర్తిచేసిన మెట్రో అధికారులు
  • కంటైన్మెంట్‌ జోన్లలోని స్టేషన్లలో ఆగవు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మరో మూడ్రోజుల్లో మెట్రో రైలు పట్టాలపై పరుగులు తీయనున్నది. ప్రయాణికుల సంఖ్యను బట్టి ప్రతి ఐదు నిమిషాలకో రైలు నడుపాలని మెట్రోరైల్‌ అథారిటీ నిర్ణయించింది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సన్నాహాలు చేసింది. మాస్క్‌ ధరించని, భౌతికదూరం పాటించని ప్రయాణికులకు సీసీ కెమెరా సాయంతో జరిమానా విధించనున్నారు. ప్రయాణికుల ఆరోగ్యం దృష్ట్యా కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే మెట్రోస్టేషన్ల సేవలను నిలిపివేశారు. ఈ మేరకు.. గాంధీ దవాఖాన, భరత్‌నగర్‌, మూసాపేట, ముషీరాబాద్‌, యూసుఫ్‌గూడ స్టేషన్లలో రైళ్లు ఆగవు. ఈ నెల 7న మొదటి దశ మియాపూర్‌- ఎల్బీనగర్‌ కారిడార్‌లో రైళ్లు నడుస్తాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల  నుంచి రాత్రి 9 గంంటల వరకే రైళ్లను నడుపుతారు. రెండోదశ రైళ్లు 8న ప్రారంభమవుతాయి. కారిడార్‌ 3- నాగోలు నుంచి రాయదుర్గ వరకు రైళ్ల రాకపోకలు సాగుతాయి.  ఈ నెల 9న ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ స్టేషన్‌తోపాటు మొత్తం మూడు కారిడార్లలో రైళ్లు నడుస్తాయని మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌తోపాటు అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. 


logo