సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 23:13:21

మెట్రో రైల్‌ సమయం పొడిగింపు

మెట్రో రైల్‌ సమయం పొడిగింపు

హైదరాబాద్‌ :  మెట్రో రైల్ ప్రయాణికులకు మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు సమయం పొడిగించినట్లు తెలిపారు. రేపటి నుంచి ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మెట్రో రైళ్లు నడవనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా భరత్‌నగర్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు తెరుచుకోనున్నాయని వెల్లడించారు. ప్రస్తుతానికి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు రైళ్లు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి మొదటి రైలు ప్రతిరోజూ 07:00 గంటలకు బదులు 6 గంటల 30 నిమిషాలకే ప్రారంభమవుతుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.