మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 13:17:15

కెమిస్ట్రీలో విజ‌య‌ల‌క్ష్మికి డాక్ట‌రేట్‌..

కెమిస్ట్రీలో విజ‌య‌ల‌క్ష్మికి డాక్ట‌రేట్‌..

హైద‌రాబాద్‌: ర‌సాయన శాస్త్రం(కెమిస్ట్రీ)లో మీసాల విజ‌య ల‌క్ష్మీకి ..  ఉస్మానియా యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ డాక్ట‌రేట్‌ను ప్ర‌దానం చేసింది. సింథ‌సిస్ క్యార‌క్ట‌రైజేష‌న్ ఆఫ్ నైట్రోజ‌న్ కంటెయినింగ్ హెటిరోసైకిల్ అండ్ ఎవాల్యూవేష‌న్ ఆఫ్ దేర్ యాంటీ బైక్రోబియ్ యాక్టివిటీ అనే అంశంపై విజ‌య ల‌క్ష్మీ త‌న ప‌రిశోధ‌నా గ్రంధాన్ని స‌మ‌ర్పించారు.  ఓయూలోని ఫార్మ‌సీ డిపార్ట్‌మెంట్‌లోని ప్రొఫెస‌ర్ ర‌వీంద్ర‌నాథ్ వ‌ద్ద ఆమె పీహెచ్ డీ చేశారు.  విజయ లక్ష్మి సమర్పించిన  పరిశోధన గ్రంధాన్ని పరిశీలించిన ఓయూ పరీక్షల విభాగం అధికారులు ఆమెకు ఓయూ డాక్టరేట్ ప్రదానం చేసిన‌ట్లు ఓ ప్రకటనలో తెలిపారు.  విజయ లక్ష్మి ప్రస్తుతం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె 2 పేపర్స్ రాసి,5 సెమినార్స్ లో పాల్గొన్నారు. హైద‌రాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన ఆమె పీహెచ్‌డీ పూర్తి చేయడానికి సహకరించిన గైడ్ ప్రోఫెస‌ర్ రవీంద్రనాథ్, భర్త రామ కోటేశ్వర్, కుటుంభ సభ్యులు, సహా విద్యార్థులకు,విభాగం ఆచార్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయ లక్ష్మి ని విభాగం ఆచార్యులు, విద్యార్థులు అభినందించారు.