శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 02:26:15

అడుగుపెడితే.. ఊరుకోం!

అడుగుపెడితే.. ఊరుకోం!

  • ఆంధ్రా ఉద్యోగులపై ఉమ్మడిపోరు
  • విద్యుత్‌ ఉద్యోగ జేఏసీల విలీనం 
  • టీవీఈజేఏసీగా ఆవిర్భావం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆంధ్రా విద్యుత్‌ ఉద్యోగులు తెలంగాణలో అడుగుపెడితే ఊరుకోబోమని, ఉమ్మడిగా అడ్డుకుంటామని విద్యుత్‌ ఉద్యోగ జేఏసీ నేతలు సంయుక్తంగా ప్రకటించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ, తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీలుగా వేర్వేరుగా పోరాడిన నేతలంతా ఏకమయ్యారు. రెండు జేఏసీలు విలీనమై గురువారం తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ (టీవీఈజేఏసీ)గా ఆవిర్భవించాయి. టీవీఈజేఏసీ నేతలంతా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

584 మంది ఆంధ్రా ఉద్యోగులను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోవద్దని కోరారు. జస్టిస్‌ ధర్మాధికారి ఉత్తర్వులకు విరుద్ధంగా 584 మందిని ఏపీ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు రిలీవ్‌చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన విద్యుత్‌ ఉద్యోగుల నిరసనలు- రిలే దీక్షలు గురువారం నాలుగోరోజుకు చేరాయి. కార్యక్రమంలో జేఏసీ నేతలు ఎన్‌ శివాజీ, పీ రత్నాకర్‌రావు, బీసీరెడ్డి, పీ అంజయ్య, సదానందం, వినోద్‌, ఈశ్వర్‌గౌడ్‌, పరమేశ్‌, గణే శ్‌, భానుప్రసాద్‌, అనిల్‌, రామేశ్వరయ్యశెట్టి, కిరణ్‌, కుమారస్వామి, నారాయణ నాయక్‌, నెహ్రూ, వెంకటనారాయణ పాల్గొన్నారు.


logo