మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 17:56:54

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత : మంత్రి గంగుల

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత : మంత్రి గంగుల

కరీంనగర్‌ : ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని 59వ డివిజన్‌ జ్యోతినగర్‌లో లక్ష్మీ, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల, ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌, మేయర్‌ సునీల్‌రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జ్యోతినగర్‌ కాలనీవాసులు కలిసికట్టుగా ఆలయాన్ని నిర్మించుకోవడం వారి ఐక్యతకు నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 


logo