మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 17:15:27

అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో మెమో దాఖలు

అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో మెమో దాఖలు

సికింద్రాబాద్‌ : కిడ్నాప్‌ కేసులో ఏ1గా అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోగ్యంపై సికింద్రాబాద్‌ కోర్టులో మెమో దాఖలు అయింది. ఆమె తరపు న్యాయవాది ఈ మెమో దాఖలు చేశారు. జైలులో అఖిలప్రియ కిందపడ్డారని, ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని వెల్లడించారు. వెంటనే అఖిలప్రియను చికిత్స కోసం ఈఎన్‌టీ సర్జన్‌ దగ్గరకు తరలించాల్సిందిగా కోరారు. అదేవిధంగా హెల్త్‌ బులెటిన్‌ విడుదలకు జైలు అధికారులను ఆదేశించాలని న్యాయవాది కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. అఖిల‌ప్రియ ఆరోగ్య ప‌రిస్థితిపై త‌క్ష‌ణ‌మే నివేదిక ఇవ్వాల‌ని జైలు అధికారుల‌ను ఆదేశించింది.