శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 02:08:34

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
  • కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలు అభినందనీయం
  • సినిమా షూటింగ్‌ వాయిదా వేసుకొన్నా: చిరంజీవి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నివారణకు తనవంతుగా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రము ఖ నటుడు చిరంజీవి ప్రకటించారు. షూటింగ్‌లో పెద్ద సంఖ్య లో సాంకేతిక నిపుణులు పనిచేస్తారని, వారి ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకొని సినిమా షూటింగ్‌ను 10 నుంచి 15రోజులపాటు వాయిదా వేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణ ఉద్యమంలో సినీరంగం కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం కూడా ఉండాలని పేర్కొన్నారు.
logo