శనివారం 06 జూన్ 2020
Telangana - May 05, 2020 , 02:38:40

రాజేంద్రనగర్‌లో మెగా డెయిరీ

రాజేంద్రనగర్‌లో మెగా డెయిరీ

  • రూ.240 కోట్లతో ఏర్పాటు: మంత్రి తలసాని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో రూ.240 కోట్లతో మెగాడెయిరీని ప్రభుత్వం ఏర్పా టుచేయనున్నట్టు పశుసంవర్ధకశాఖ మం త్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. ఇందుకోసం ఇతర రాష్ర్టాల్లో  అధ్యయనం చేయాలని సూచించారు. లాక్‌డౌన్‌లో ప్రజలకు పాడి ఉత్పత్తుల సరఫరా తదితర అంశాలపై సోమవారం ఆయన పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్షించారు. కరోనా నేపథ్యంలో పాలసేకరణ, సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని, వా హనాలను శానిటైజ్‌ చేయాలని అధికారులను మంత్రి ఆదేశిం చారు. పశువైద్యులకు పదోన్నతులు కల్పించాలని పశువైద్యుల సంఘం ప్రతినిధులు దేవేందర్‌, నాగరాజుయాదవ్‌, అరవింద్‌రెడ్డి, ధీరజ్‌ తదితరులు తలసానికి వినతిపత్రం సమర్పించారు.logo