బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 18:58:05

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం.. పాల్గొన్న మంత్రులు

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం.. పాల్గొన్న మంత్రులు

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంగళవారం నూతన రెవెన్యూ చట్టం మీద చర్చించేందుకు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దళిత, గిరిజనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టినా.. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడితే వారికి లబ్ధి చేకూరుతుందో తెలియజేయాలన్నారు. ఈ విషయమై ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమై చర్చించి తనకు చెప్పాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశాన్ని ఒక అవకాశంగా భావించి దళిత, గిరిజనులకు మేలు చేసే సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ దళితులు, గిరిజనులకు మేలు జరిగే  విధంగా మరిన్ని కార్యక్రమాలు రూపొందించడానికి సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రజాప్రతినిధులను కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo