శనివారం 04 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 17:48:04

మత్స్య శాఖపై మంత్రుల సమీక్ష

మత్స్య శాఖపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్‌: మత్స్య శాఖ విభాగంలో అమలు చేస్తున్న పలు పథకాలు, విధానాలపై రాష్ట్ర మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయకర్‌ రావు, చామకూర మల్లా రెడ్డి పాల్గొన్నారు.  హైదరాబాద్‌లో పశు సంవర్ధక, మత్స్య శాఖ విభాగం కింద అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై పశు సంవర్దక శాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మత్స్య శాఖ అభివృద్దికి వ్యవసాయ, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌, ఇండస్ట్రీస్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రులు భావించారు. ఇది మంచి ప్రోత్సాహకానికి దారితీస్తుందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. సీఎం కేసిఆర్‌ దిశా నిర్దేశంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను మంత్రి కేటీఅర్‌ నేతృత్వంలో ఖరారు చేశారు.logo