శనివారం 06 జూన్ 2020
Telangana - May 16, 2020 , 17:04:18

సన్న బియ్యం పెరగాలె...

సన్న బియ్యం పెరగాలె...

సీఎం సూచనల మేరకు పెద్దపల్లి జిల్లాలో నూతన వ్యవసాయం విదానంపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ వానాకాలంలో రైతులు సాగు చేయాల్సిన పంటలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఇదివరకు సన్న రకము బియ్యం రాష్ట్రంలో 35శాతం సాగు చేయగా, ఇప్పుడు 50 శాతంకు మించి పంట సాగుకు కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి అన్నారు. అలాగే జిల్లాలో మండలాల వారిగా  అధికారులు చర్చా వేదికల ద్వారా రైతులతో చర్చించాలని సూచించారు. పంటసాగుపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు.


logo