శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 18, 2020 , 17:55:53

సర్ది, దగ్గు, జ్వరానికి మందులకోసం వస్తే సమాచారం ఇవ్వండి

సర్ది, దగ్గు, జ్వరానికి మందులకోసం వస్తే సమాచారం ఇవ్వండి

హైదరాబాద్‌: నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల జల్లడ పట్టేందుకు జీహెచ్‌ఎంసీ అప్రమత్తమయ్యింది. దీనికి సంబంధించి మెడికల్‌ షాపుల యజమానులతో సమావేశం నిర్వహించాలని మన్సిపల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అడిషనల్‌ కమిషనర్లకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (జీహెచ్‌ఎంసీ) ఆదేశాలు జారీచేసింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, సర్ది వంటివాటికి మందుల కోసం వచ్చే వినియోగదారుల వివరాలు తప్పనిసరిగా తీసుకునేలా మెడికల్‌ షాప్‌ యజమానులకు ఆదేశించాలని, ఆ వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందించేలా వ్యవస్థను రూపొందించాలని సూచించింది. కరోనా లక్షణాలతో మెడికల్‌ షాప్‌కు వచ్చే వారికి వాటి యజమానులు కౌన్సిలింగ్‌ నిర్వహించేలా శిక్షణ ఇవ్వాలని అధికారులకు తెలిపింది. కరోనా పరీక్షలకు అందరూ సిద్ధంకావాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని అన్నింటికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది.


logo