గురువారం 02 జూలై 2020
Telangana - May 31, 2020 , 14:26:14

పన్నులు చెల్లించండి.. నగరాభివృద్ధికి సహకరించండి: మేయర్‌

పన్నులు చెల్లించండి.. నగరాభివృద్ధికి సహకరించండి: మేయర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీబర్డ్‌ పథకానికి నగరంలో విశేష స్పందన వచ్చిందని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. కరోనా నేపథ్యంలో నివాస గృహాలతోపాటు, సెమి రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ఆస్తులకు కూడా ఎర్లీబర్డ్‌ కింద 5 శాతం రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు. గతేడాది మే నెలాఖరుకు రూ.567 కోట్ల ఆస్తిపన్ను వసూలైందని, ఇవాళ అర్థరాత్రి 12 గంటల వరకు ఎర్లీబర్డ్‌ పథకం కింద 5 శాతం రాయితీతో ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను చెల్లించవచ్చని చెప్పారు. మీ-సేవా, సిటిజన్‌ సర్వీసెస్‌ సెంటర్లు ఈ రోజుల సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


logo