ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 22:24:18

అందుబాటు ధరల్లో ఔషధాలు

అందుబాటు ధరల్లో ఔషధాలు

హైదరాబాద్‌: లక్షలాది మందికి అందుబాటు ధరల్లో ఔషధాలు అందిస్తున్నామని ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త జీవీ ప్రసాద్‌ అన్నారు. ‘రీడిఫైనింగ్‌ సస్టెయినబుల్‌ లీడర్‌ షిప్‌ - ది కోవిడ్‌ - 19’ ఎఫెక్ట్‌ అంశంపై ప్రఖ్యాత నవలా రచయిత, జర్నలిస్ట్‌ శ్రీరామ్‌ కర్రితో ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన సంభాషణ కార్యక్రమానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ లిమిటెడ్‌ కో - చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘మార్పు ద్వారా ముందుకెళ్తూ సుస్థిరదాయక వ్యాపారానికి హామీ ఇస్తూ మేము లక్షలాది మందికి అందుబాటు ధరల్లో ఔషధాలు అందించగలుగుతున్నాం. అడాప్ట్‌ అయ్యేందుకు గల సామర్థ్యమే ఇక్కడ కీలకం’ అని అన్నారు.

డాక్టర్‌ రెడ్డీస్‌ నేడు అంతర్జాతీయంగా పేరొందిందని, శాస్త్రీయ వినూత్నత, ప్రగతిశీలక వ్యక్తుల విధానాలు, కార్పొరేట్‌ పాలన అత్యున్నత ప్రమాణాలు లాంటివాటికి పరిశ్రమలో పేరొందిందన్నారు. అది నేడు ఈ స్థాయిలో ఉండేందుకు పరిశోధన, వినూత్నత, పారదర్శకత, వ్యాపార నైతిక విలువలు, లీనర్‌ కార్పొరేట్‌ స్ట్రక్షర్‌ లాంటివి ఎంతగానో తోడ్పడ్డాయని జీవీ ప్రసాద్‌ అన్నారు. ఈ సందర్భంగా ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్‌ పర్సన్‌, పాల్మన్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ప్రై.లి. వ్యవస్థాపక డైరెక్టర్‌ ఉషారాణి మన్నె మాట్లాడుతూ, ‘జీవీ ప్రసాద్‌ గురించి, డాక్టర్‌ రెడ్డీస్‌ కోసం రూపొందించిన రూట్‌ మ్యాప్‌లో ఆయన తోడ్పాటు గురించి తెలుసుకోవడం మాకెంతో స్ఫూర్తిదాయకమని వఅన్నారు. logo