శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 06:44:11

వైద్య సిబ్బందికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలి

వైద్య సిబ్బందికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలి

ఖైరతాబాద్‌: కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైందని, దవాఖానకు వచ్చి వెళ్లేందుకు వారికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలని నిమ్స్‌ పారామెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొమ్మిరెడ్డి మురళీధర్‌, శీరందాస్‌ శ్రీనివాస్‌లు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ  సేవలందిస్తుందని, ప్రస్తుతం రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. వ్యక్తిగత వాహనాలు ఉపయోగించి విధులకు వెళ్తున్న వారిపై కూడా ఆంక్షలు విధిస్తున్నారని, వైద్య సిబ్బందికి ప్రత్యేక పాసులు ఇవ్వాలని, అలాగే ఐడీ కార్డులు చూపిస్తే వారిని విధులకు పంపించాలన్నారు. logo