e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home తెలంగాణ డిగ్రీ కూడాలేని మెడికల్‌ ఆఫీసర్‌!

డిగ్రీ కూడాలేని మెడికల్‌ ఆఫీసర్‌!

డిగ్రీ కూడాలేని మెడికల్‌ ఆఫీసర్‌!
  • ఈటల అండతో ఆయుష్‌లో అనుచరుడి వైభోగం
  • ఆయన హుకుంతో పదవీ కాలం రెండేండ్లు పొడిగింపు
  • ప్రభుత్వానికి నివేదిక పంపించాం: ఆయుష్‌ డైరెక్టర్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): తీగ లాగితే డొంక కదిలినట్టు మాజీమంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. భూ కబ్జాలు, ఎగ్జిబిషన్‌ సొసైటీలో అక్రమాలు బయటపడగా, తాజాగా.. డిగ్రీ కూడా లేని వ్యక్తికి అర్హత లేకున్నా మెడికల్‌ ఆఫీసర్‌గా కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చినట్టు వెలుగుచూసింది. ఆ పోస్టులో కడర్ల వెంకటాచారి అనే వ్యక్తిని కొనసాగించేందుకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఆ పోస్టులో అతడు కొనసాగేలా పదవీకాలాన్ని ఐదేండ్లపాటు పొడిగిస్తూ ఈటల ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం. వైద్యారోగ్యశాఖ, ఆయుష్‌ విభాగం ఉన్నతాధికారులు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగికి ఒకేసారి ఐదేండ్లపాటు పదవీకాలాన్ని పొడిగించటం సాధ్యం కాదని చెప్పటంతో రెండేండ్లకు కుదించిన ఈటల మౌఖిక ఆదేశాలు ఇచ్చి.. వెంకటాచారి పదవీకాలాన్ని 1-4-2020 నుంచి 31-3-2022 వరకు పొడిగించారు.

ఎవరీ వెంకటాచారి?
కడర్ల వెంకటాచారి వృత్తిరీత్యా రంగురాళ్ల వ్యాపారి. 2013లో నాటి ఆంధ్రా పాలకుల అండదండలతో అక్రమంగా ఆయుష్‌ విభాగంలోని వేమన యోగా రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఇన్‌చార్జ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సిద్ధ)గా చేరాడు. స్వామీజీ అవతారం ఎత్తి జ్యోతిషం పేరుతో భవిష్యవాణి, రంగురాళ్లు, క్షుద్రపూజలు వంటివి చేశాడు. బేగంపేటలోని ప్రకృతి చికిత్సాలయానికి వచ్చే రోగులను తన ఇంటివద్దకు పిలిపించుకొని పూజలు, జ్యోతిషం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్టు నేచురోపతి వైద్యులు, విద్యార్థులు 2020లో ఆయుష్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అలుగు వర్షిణి, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, నాటి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయుష్‌ డైరెక్టర్‌ సర్టిఫికెట్లను సమర్పించాలని వెంకటాచారికి నోటీసు జారీచేశారు.

- Advertisement -

ఈటల అండతో అక్రమంగా జీవో
ఆయుష్‌ డైరెక్టర్‌ జారీచేసిన నోటీసులతో వెంకటాచారి.. అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను సంప్రదించినట్టు సమాచారం. కొంతకాలం వేచి ఉండాలని చెప్పిన ఈటల.. ఆయుష్‌ డైరెక్టర్‌ వర్షిణి సెలవుపై వెళ్లిన వెంటనే వెంకటాచారిని ఐదేండ్లపాటు వేమన యోగా రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీలుకాదని ఉన్నతాధికారులు చెప్పటంతో రెండేండ్లు కొనసాగించాలంటూ ఈటల ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. చారికి సంబంధించిన జీతాన్ని ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ ‘2210 05-200-25-06-310-312’నుంచి నేరుగా అందచేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయించారు. వెంకటాచారి మెడికల్‌ ఆఫీసర్‌గా అర్హుడు కాదని, ఎలాంటి డిగ్రీ లేదని, స్టేట్‌ మెడికల్‌ బోర్డులో కూడా రిజిస్టర్‌ కాలేదని ఆయుష్‌ డైరెక్టర్‌ వర్షిణి తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, ఆదేశాలు రాగానే చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డిగ్రీ కూడాలేని మెడికల్‌ ఆఫీసర్‌!
డిగ్రీ కూడాలేని మెడికల్‌ ఆఫీసర్‌!
డిగ్రీ కూడాలేని మెడికల్‌ ఆఫీసర్‌!

ట్రెండింగ్‌

Advertisement