సోమవారం 25 మే 2020
Telangana - Apr 08, 2020 , 06:12:26

సలహా కోసం మెడికల్‌ హెల్ప్‌లైన్‌

సలహా కోసం మెడికల్‌ హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ వేళ ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్యుల సలహాలు, సూచనలు అందించేందుకు ఫోరం ఫర్‌ పీపుల్స్‌ హెల్త్‌ సంస్థ ఏర్పాటుచేసిన మెడికల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు భారీ స్పందన లభిస్తున్నది. 040-48214595 నంబర్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి ఈ నెల 1న నుంచి మంగళవారం వరకు 5 వేల కాల్స్‌ చేశారని సంస్థ నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోగ్య సమస్యలపై సాయం పొందినట్టు చెప్పారు. ఎమర్జెన్సీ కేసుల పరిష్కారం కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక వలంటీర్‌ను నియమించినట్టు సంస్థ ప్రతినిధి రమేశ్‌భీంరెడ్డి తెలిపారు.


logo