బుధవారం 03 జూన్ 2020
Telangana - May 04, 2020 , 20:47:50

తెలంగాణలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన 3 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1085కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 471 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న 40 మంది ఇవాళ డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 585 మంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo